Monday, June 9, 2014

"మనం" - ఒక విశ్లేషణ

“పునరపి జననం, పునరపి మరణం, పునరపి జననీ జఠరే శయనం…”
తెలుగు సినిమా అనే కాదు, ఏ భాషా సినిమాఅయినా పునర్జన్మల ఆధారంగా తీస్తే ఇంత దాకాఎన్ని రకాలుగా తీసినా హిట్ అయ్యాయి అంటేమనిషికి పునర్జన్మ పై ఆసక్తి ఎలాంటిదోఅర్థమవుతుంది.. ఒకప్పటి మూగ మనసులనుండి, మొన్నటి అరుంధతి, మగధీరవరకూ...ఒక జన్మలో అసంపూర్ణంగా మిగిలిపోయిన భావోద్వేగాలు మరు జన్మలోకొనసాగడమనే ఒకే ఒక్క లైన్ ఆధారంగా ఎన్నిరకాలుగా సినిమా తీసినా... అది హిట్టే... “మనం”గురించి నేను కొత్తగా చెప్పక్కరలేదు.. కాక పోతేఆసక్తి గా అనిపించిన విషయం ఏమంటే ...నాగేశ్వర రావు ఆఖరి చిత్రం పునర్జన్మల మీదఉండడం... ఆయన తను మళ్ళీ ఈ లోకానికినటుడుగా తిరిగొస్తాననే సందేశాన్ని సినిమాద్వారా భగవంతుడు చెప్పించాడేమో అనే భావనకలిగిస్తుంది... !
 
కథ గా చెప్పాలంటే చెప్పొచ్చు కానీ కథచెప్పడం నాకు ఇష్టం లేదు.. ఎందుకంటే ఒక ఫ్లోలో ఈ సినిమా చూసెయ్యాలి అంతే! అప్పుడేదీన్ని పరిపూర్ణంగా ఆనందించొచ్చు.. మనసుకుతాకే సున్నితమైన భావోద్వేగాలూ, అనవసరహంగులూ, ఆర్భాటాలూ లేక పోవడం, పిచ్చిపిచ్చి ఫైటింగులు లేక పోవడం ఈ సినిమాలోచాలా రిలీఫ్ పాయింట్లు.. కాక పోతే కొన్ని కొన్నిలాజిక్కులు మాత్రం పక్కన పెట్టాలి. ఒకసినిమాలో ఏదైనా విషయం చెప్పాలంటే, ఆవిషయాన్ని లాజిక్ కు లోబడే చెప్పాలి అంటేచాలా కష్టం.. అలా చెప్పినప్పుడు దర్శకుడు 
ఏప్రభావాన్ని జనాల మీద చూపాలనుకొన్నాడోఅది మిస్ అవ్వొచ్చు..
 
దేనికీ కాపీ గానీ, అనుకరణ కాని ఈ మనం ANRకు పట్టిన నివాళి లాంటిది.అందరూచెప్పేదేమంటే, అక్కినేని కుటుంబమంతా కలసినటించారు అనే థ్రిల్ ఈ సినిమా ఇస్తుందని.. కానీనా వరకు ఈ సినిమా మొదలెట్టాక నాకుసినిమాలోని పాత్రలే కనిపించాయి కానీ నటులుకనబడలేదు.. ముఖ్యంగా నాగార్జున (సినిమాలోనాగార్జున పాత్ర కాదు) ఈ సినిమా మొత్తంహుందాగా కనిపించాడు. వెకిలి చేష్ట ల జోకులూ,రెండర్థాల మాటలూ మచ్చుకైనా లేవు.. ఒకానొకసన్నివేశంలో అమల, అలాగే మరో సన్నివేశం లోఅమితాబ్ బచ్చన్ కనిపించడం ప్రేక్షకులకుబోనస్ లాంటిది !

 
మనకు చాలా సార్లు మన జీవితాల్లో మనకుపరిచయం లేని వ్యక్తులని చూసినప్పుడు ఆవ్యక్తులతో మనకు ఎంతో పరిచయం ఉన్నట్టు,వారి గురించి మనకు చాలా తెలిసినట్టుఅనిపించడం జరుగుతుంది.. ఈ అంశాన్నిదర్శకుడు వాడుకొన్న తీరు ఆయన పరిణతినిసూచిస్తుంది. స్క్రీన్ ప్లే చాలా సంక్లిష్టంగాఉంది... ఇంత సంక్లిష్టమైన స్క్రీన్ ప్లే నుప్రేక్షకుడికి అయోమయం కలిగించకుండాచెప్పడమూ అద్భుతం !
 

జీవితం చాలా చిన్నది... ఈ చిన్న జీవితాన్నిఅర్థం లేని ఈగోలతో నరకం చేసుకోవద్దనేసున్నితమైన విషయాన్ని హృదయానికిహత్తుకొనేలా చెప్పడమూ చాలా నచ్చింది...అన్నీ శాశ్వతమని భావిస్తూ, తీరా ఈగోలేపరమావధి కాదు అని తెలిసే లోపే జీవితంముగిసి పోతే... ఆ వాసనలు మరుజన్మ వరకూతరుముతూనే ఉంటాయి కనుక ఆలోచనల్లోఎదుటి వారి కోణం కూడా ఆలోచించాలనేవిషయాన్ని చైతన్య పాత్ర ద్వారా చెప్పించడమూబాగా నచ్చింది. పరస్పరమూ ఈగోలతోనిత్యమూ పోట్లాటల్లో జీవించే భార్యా భర్తలు తమపిల్లలు, తాము ఎంతలా కలసి ఉండాలనికోరుకొంటారో సున్నితంగా ఆవిష్కరించిన తీరుఅమోఘం !
 
చిన్న జీవితాన్ని ప్రేమమయం చేసుకొని,ఈగోలను మాయం చేసుకొని జీవించండి..అనిచాటే ఈ చిత్రం.. అందరూ చూడాల్సిన సినిమా..ముఖ్యంగా నేటి యువతరం!

No comments: