Sunday, July 28, 2013

ఇంటిదీపమై వెలిగే ఇంధనాలు ఇంతులూ - కొంప కొఱివిగా మారే కారణాలు కాంతలు - 2

మేం నలుగురు మిత్రులం.. కాలేజీ రోజుల్నుండీ మాకు స్నేహం ఉంది. జీవన గమనం లో చెరో ప్రాంతానికి వెళ్ళినా ఇప్పటికీ కనీసం రెండేళ్ళ కొక సారి కలుస్తుంటాం. మా అదృష్టమో ఏమో కానీ మాకు అందరికీ ఒకే కంపెనీ లో ఉద్యోగాలు వచ్చాయి. కలిసి చదువుకొన్న వాళ్ళంకలిసి ఉద్యోగాలు వెతుక్కొన్న వాళ్ళం.. ఇక ఒకే కంపెనీ లొ పని చేస్తే సరదాయే వేరు. అప్పట్లో మా నలుగురిలో ఒకడికి చదువు పూర్తవ్వగానే పెళ్ళైందిదాంతో ముగ్గురు మిత్రులం హైదరాబాద్ లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని నివాసముండే వాళ్ళం.. సహజంగానే మా మాధ్య ఒక చర్చ వచ్చేది చాలా సార్లు.. పెళ్ళి గురించి..
అవడానికి ముగ్గురమూ మంచి స్నేహితులమైనా మా ముగ్గురికీ మూడు విభిన్న అభి ప్రాయాలు ఉండేవి పెళ్ళీ గురించి! సౌకర్యం గా ఉండడం గురించి ముగ్గురికీ మూడు పేర్లు పెట్టుకొందాం. నా పేరు వరుణుడుమిగతా ఇద్దరు పేర్లనూ మార్చడం జరిగింది.. ఒకడు నవీన్, మరొకడు అర్జున్ !
అప్పట్లో యండమూరి నవలల ప్రభావం.. సినిమాల ప్రభావం బాగానే ఉండేది మా మిత్రులకు. అలా ఎలాంటి ప్రభావలకు లోను కానిది అర్జున్ ఒక్కడే.. వాడికి మొదట్నుండీ ప్రతీ విషయం ప్రాక్టికల్ గా ఆలోచించడం అలవాటు. నవీన్ తరహా పూర్తిగా విభిన్నం.. భావుకుడు.. సున్నిత మనస్కుడు మొహమాటం ఎక్కువ! అప్పట్లో నవీన్ అంటే పడి చచ్చిపోయే ఒక అమ్మాయి  ఉండేది. నవీన్ కు కూడా అమ్మాయి అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళ కులాలు వేరు! ఇంట్లో అడగాలంటే భయం ! మొహమాట పడేవాడు. తమ పెంపకం బాలేదు అని తల్లీదండ్రీ ఎక్కడ బాధ పడతారో అని చివరి దాకా ఇంట్లో చెప్పనే లేదు. అలా అని అమ్మాయి వెంట సినిమాలూ షికార్లూ తిరగలేదు.. కానీ భార్య అంటూ వస్తే అలాంటి అమ్మాయే రావలనుకొన్నాడు.. అమ్మాయి ఎదురు చూసీ చూసీ విసుగెత్తి, వేరే అతన్ని పెళ్ళి చేసుకొని వెళ్ళి పోయింది.. ఎందుకు చెబుతున్నానంటే.. కథల్లోలా, విశ్లేషణల్లోలా జీవితాలు ఉండవు. మేమంతా అప్పట్లో నవీన్ మీద పిరికి వాడి ముద్ర వేసాం. ఇక నా గురించి.. పెద్దగా పెళ్ళి మీద ఎలాంటి అభిప్రాయాలూ లేవు అప్పట్లో.. !
ఇదంతా ఎందుకు చెప్పానంటే.. మా మధ్యలో వచ్చే పెళ్ళి గురించిన చర్చ గురించి చెప్పడానికి..!
నవీన్ అనేవాడు.. పెళ్ళైన తర్వాత  భార్య మీద పెత్తనం చెలాయిస్తే, అధికారం చెలాయిస్తే ఎప్పటికీ అమ్మాయి భర్తను ప్రేమించలేదు. పైపెచ్చూ జీవించినన్ని నాళ్ళూ ఒక అసంతృప్తితో బతికేస్తుంది.. జీవితంలో దేన్నైనా భరించగలం కానీ మన జీవన భాగస్వామి మన పట్ల నిర్లిప్తంగా, ఉదాసీనంగా వ్యవహరించడం భరించలేము అని ! అందుకే తనకు వచ్చే భార్య పట్ల తను ఎప్పుడూ అధికారం చెలాయించడం లాంటి పనులు చెయ్యననే వాడు. అమ్మాయి సుఖ సంతోషాలు, అమ్మాయి ఇష్టాయిష్టాలు అర్థం చేసుకొని వీలైనంత వరకూ గొడవ పడకుండా చూసుకొంటాననే వాడు. భార్యలో నచ్చని గుణం అంటూ ఉంటే ప్రేమ పూర్వకంగా మార్చుకొంటానని చెప్పేవాడు.. ఒక వేళ మార్చుకోలెక పొతే విషయం భార్యకే వదిలేస్తాననే వాడు. జీవితంలో ఎవరి దగ్గర నుండి ఏమి సాధించాలన్నా అది ప్రేమగా మాత్రమే సాధించుకోగలం అని మనస్ఫూర్తిగా నమ్మే వాడు. అధికారం తో అహంకారం తో వ్యక్తిని గెలవలేమని ప్రగాఢంగా విశ్వసించే వాడు.
అర్జున్ మరో టైపు ! చెప్పాగాకొంచం ప్రాక్టికల్ మనిషి .. !!
తన అభిప్రాయం ప్రకారం..
ప్రేమగా అన్ని సార్లూ అన్ని చోట్లా గెలవలేము.. కనుక అద్ధికారం చెలాయించైనా సరే తనకు కావాల్సిన పని నెరవేర్చుకోవాలనే వాడు. ఒక వేళ అధికారం చెలాయించాకైనా సరే తను కోరుకొన్నది జరగక పోతే విడాకులకైనా సిధ్ధమనే వాడు.. అలా అని భార్యను బానిసలా చూడాలని కాదు. కానీ జీవితంలో తనకు ఇష్టమైన విషయాన్ని భార్య కొరకు కూడా వదులుకోననే వాడు.

సహజంగానే నాకూ, నవీన్ కూ అర్జున్ ఆలోచనలు నచ్చేవి కావు. చాలా మోటుగా, అనాగరికంగా అనిపించేవి.. మేము ఇద్దరమూ ఒక వైపు, అర్జున్ ఒక్కడు ఒక వైపు ఎన్నో సార్లు వాదించుకొనే వాళ్ళం!

ఎవరి జీవితాల్లోనైనా మాట కనీసం ఒక్కసరైనా వినబడుతూ ఉంటుంది.. “ నీకు రాబోయేది ఎవరో గానీ చాలా అదృష్ట/దురదృష్ట వంతురాలుఅని !
అర్జున్ తో అదే అనే వాళ్ళం.. తనకు రాబోయే అమ్మాయంత దురదృష్టవంతురాలు మరొకరు ఉండరని ! అలా అని అర్జున్ చెడ్డవాడు కాదు.. ప్రాక్టికాలిటీకి, చెడ్డతనానికీ తేడా  ఉంది.. అర్జున్ లో చాలా మంచి గుణాలున్నాయి.. కానీ ఎవరైనా తన మీద డామినేట్ చెయ్యడాన్ని అసలు సహించే వాడు, అలా చేసేది, మేనేజర్ అయినా, స్నేహితులైనా ఎవరినీ లెక్క చేసే వాడు కాదు.. తనకు నచ్చిన విషయం లొ ఎంత దాకా అయినా వెళ్ళే వాడు..
నవీన్ చాలా సార్లు చెప్పేవాడు అర్జున్ కుఅలా మొండితనం వల్ల జీవితంలో అన్నీ కోల్పోవాలే కానీ పోందేదేదీ ఉండదు అని..  ఒక మాట చెప్పే వాడు – “ the more arguments you win – the more people you loseఅని.. చాలా సత్యముందిఆ మాటల్లో..
 కానీ అర్జున్ దానికి ఒప్పుకొనే వాడు కాదు.. మన ఇష్టాలను గౌరవించలేని వ్యక్తి మనతో ఉంటే యేం, పోతే యేం? అనే వాడు.. ఇంకా ముందుకెళ్ళి అందరూ అనుకొంటున్నట్టు కాకుండా నవీన్ కు జీవితమంతా కష్టాలే ఉంటాయని.. ఎవరినీ ప్రేమతో మార్చలేమనీ అనేవాడు. నవీన్ (కాబోయే) భార్య నవీన్ను లెక్క చెయ్యదనీనవీన్ సిధ్ధాంతం చాలా తప్పనీ వాదించేవాడు..

నా వరకూ నాకైతే నవీన్ పధ్ధతే కరెక్ట్ అనిపించేది.. అర్జున్ ఆలోచనల్లో చాలా ఈగో ఉందనిపించేది..

ఇద్దరికీ దాదాపు ఆరు నెలల తేడాలో పెళ్ళి కుదిరింది
నవీన్ కాబోయే భార్యతో ఎంతో ఆనందంగా గడిపే వాడు.. ఇద్దరూ కలసి పార్కులకు, సినిమాలకు వెళ్ళే వాళ్ళుగంటల తరబడి కబుర్లాడుకొనే వాళ్ళు అమ్మాయి ఒక సారి నాతో అందిఎన్నో జన్మల్లో చేసుకొన్న పుణ్య ఫలమేమో  తనకు నవీన్ లాంటి జీవన భాగస్వామి దొరికాడని.. !

అర్జున్ మాత్రం, పెళ్ళి కుదిరాక తొలిసారి ఇద్దరూ పార్క్ కు వెడీతే.. ఇద్దరూ గంట లోపు గా ఇంటికొచ్చేసారు. గంటా కూడా అర్జున్ తనెంత మూర్ఖుడో, ఎలాంటి విషయాల్లో తనకు కోపం వస్తుందో, కోపం వస్తే తను ఎంతదూరం వెళ్ళగలడో అమ్మాయికి సవివరంగా చెప్పాడట..!
నేను అడిగాను. మరీ మొదటి సారి మాట్లాడుకొన్నపుడు ఇదంతా అవసరమా అని!
దానికి వాడి సమాధానం ఏమంటే – “ మరేం మాట్లాదుకోవాలి? చంద్రుడు ఎంత తెల్లగా ఉన్నాడు, వెన్నెల ఎంత చల్లగా ఉంది.. నేను ఎంత మంచివాడినో- లాంటి కబుర్లు చెప్పాలా నవీన్ గాడిలా ? “
నాకు బాధనిపించింది.. నేను కూడా అన్నాను.. అమ్మాయెవరో కానీ ఆమెను భగవంతుడే కాపాడాలి అని.. !
వాళ్ళ పెళ్ళై ఇప్పటికి పదిహేను సంవత్సరాలైంది.. సందర్భంగా అందరూ మళ్ళీ హైదరబాద్ లో కలవాలని .. అందరూ ఫామిలీలతో రావాలని ప్లాన్ చేసాం..
నవీన్ గాడు రానన్నాడు.. ఆరా తీస్తే కాసేపు బెట్టు జరిగిన తర్వాత తెలిసిన విషయం ఏమంటే..

తనకు విడాకులు మంజూరు అవబోతున్నది టైంలోనే అని చెప్పి గొల్లుమన్నాడు..

(సశేషం)

ఇది ఇప్పటి పరిస్థితులను దగ్గరగా చూడడం వల్ల చేసిన విశ్లేషణ తప్పపురుషుడు గొప్పవాడనోలేక స్త్రీలు గొప్పవారనో చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం కాదుఏవో కొన్ని సంఘటనలు చూసి స్త్రీలంతా అలాంటి వారేపురుషులంతా ఇలాంటి వారే అని చెప్పడమూ  వ్యాసాల ఉద్దేశ్యమూ కాదు.  ఎంత సేపూ స్త్రీ స్వాతంత్ర్యం , పురుష దురహంకారం లాంటి విషయాలే కాదు.. ఇలాంటివి కూడా ప్రపంచంలో జరుగుతున్నాయిచాప కింద నీటిలా  విష సంస్కృతి మన జీవితాల్లోకిమన కుటుంబాల్లోకి విస్తరిస్తోందనే అవగాహన కలిగితేదాన్ని ఎలా నివారించాలి అనే ఆలోచన కలిగితే నా ప్రయత్నం సఫలమైనట్టే..

Thursday, July 25, 2013

ఇంటిదీపమై వెలిగే ఇంధనాలు ఇంతులూ - కొంప కొఱివిగా మారే కారణాలు కాంతలు - 1


మొన్న మధ్య మా ఊరికి ఒక గొప్పాయన వచ్చారు. తెలుగు సంస్కృతికి, తెలుగు జాతికీ ఎన్నెన్నో సేవలు చేసిన అలాంటి మహనీయుడు వేదిక మీద అలా ప్రసంగిస్తుంటే పాజిటివ్ ఎనర్జీ అలా శ్రోతల్లోకి ప్రవహించింది. ఆయన ఉపన్యాసం విన్నాక ఒక రెండు మూడు గంటలైనా ఆయన మాటల ప్రభావం శ్రోతల్లో ఉంటుందంటే ఆయనకు జీవితం పైన, జీవితంలోని లక్ష్యాల పైనా ఎంత ఖచ్చితమైన అవగాహన ఉందో అర్థమౌతుంది అని అనుకొన్నాను నేను. కేవలం అనుకొని వదిలేసి ఉంటే వ్యాసం పుట్టేది కాదేమో

నేను అనుకొన్న మాటే తర్వాత మా మిత్రునితో అన్నాను.

మిత్రుడు ఆయన సభకు హాజరవలేదు.

నేను చెప్పిందంతా వినిచాలా స్ఫూర్తి దాయకమైన వ్యక్తి.. కానీ…” అంటూ నీళ్ళు నమిలాడు..

ఏంటో చెప్పుఅన్నాను నేను..

“ … ఆయనకు కరెక్ట్ ఆఫీసర్ తగల్లేదు జీవితంలోతగిలింటే.. పాజిటివ్ దృక్పథాలు, సమాజ సేవలూ అన్నీ మానేసి బుధ్ధిగా ఇంట్లో ఉండే వాడు..” అన్నాడు  అతను.

నాకు అర్థం కాలేదు..

“ … కరెక్ట్ ఆఫీసర్ తగలక పోవడం ఏమిటి? ఆయన నిర్వహించిన కార్యక్రమమైనా, ఒక్కటి కూడా సామాన్యుడు కలలో కూడా ఊహించలేనిదిఎందరో అధికారుల్ని కలవాలి.. మంత్రి స్థాయి వారితో మాట్లాడాలి.. ఒక్కో సారి ముఖ్య మంత్రిని కూడా కలవాల్సి వస్తుందినిధుల సేకరణఇలాంటి విషయాలన్నిటికి అడుగు అడుగునా అడ్డంకులే  ఉండే దేశం మనది.. అలాంటిది ఆయన అనుకొన్న ఒక లక్ష్య సాధనకు.. రక రకాల అనుభవాలు రుచి చూపించిన ఆఫీసర్స్ తగిలారు ఆయనకు.. నువ్వు ఆయన మాటలు వినిఉంటే నీకే అర్థమయ్యేది.. ఆయన ఎంతగా శ్రమించాడో..” కాస్తా బాధగా అయినా సరేగట్టిగానే చెప్పాను నేను.

మా మిత్రుడు నవ్వి.. “ కరెక్ట్ ఆఫీసర్అంటే తప్పుగా అర్థం చేసుకొన్నావ్ నువ్వు.. కరెక్ట్ ఆఫీసర్ అంటే.. భార్య …!”  అన్నాడు.

ఒక్క క్షణం తర్వాత అర్థమయ్యింది నాకు. నవ్వేసాను..

తర్వాత ఆలోచిస్తే నిజమే అనిపించింది నాకు..

అసలు భార్య సహాయ సహకారాలు లేక పోతే చాలా గొప్ప వారిగా పేరుబడ్డ వాళ్ళ జీవితం మరోలా ఉండేదేమో..

దాదాపు 35 యేళ్ళ కిందట అనుకొంటా.. వేజేళ్ళ సత్యనారాయణ దర్శకత్వంలోఆడవాళ్ళే అలిగితేఅని ఒక సినిమా వచ్చింది.. నలుగురు అన్నదమ్ములు కలసి మెలసి కష్ట సుఖాల్ని పంచుకొంటూ ఆనందంగా ఉంటారు సినిమాలో.. అంతా తమ గొప్పదనం, సర్దుకు పోయే తత్వం వల్లనే అది సాధ్యం అనుకొంటూ ఉంటారు.. ఒక రోజు ఇంటి ఆడాళ్ళు వీళ్ళను చాలెంజ్ చేస్తారు.. ఇంట్లో తమ సహకారం లేక పోతే.. వాళ్ళు అలా కలసి ఉండలేరని.. దానికి నలుగురూ వ్యతిరేకిస్తారు. బ్రహ్మ రుద్రులు వచ్చినా తమను విడదీసే శక్తి వారికి లేదనీ, ఇంట్లో ఉండే ఆడాళ్ళు మీరేం చెయ్యగలరని బీరాలు పలుకుతారు. దాంతో ఇంట్లోని ఆడాళ్ళు అంతా ఒక పథకం ప్రకారం.. మగాళ్ళను పీడించడం మొదలెడతారు.. ఆరు నెలల్లోనే అన్నదమ్ములు విడిపోతారు.. తర్వాత విషయం తెలిసి భార్యల ప్రాధాన్యత గుర్తించి వాళ్ళకు తగిన గౌరవాన్ని ఇస్తారు.. ఇదీ కథ..

ఎప్పుడో 35 యేళ్ళ క్రితం సినిమా అయినా, ఈనాటికైనా కథలో చెప్పబడ్డ నీతి అనుసరణీయమే.
సదరు గొప్పవాళ్ళ సతీమణుల గురించి ఎవరూ ఆలోచించే వాళ్ళే ఉండరు. వాళ్ళ శ్రమ, త్యాగాల గురించి పట్టించుకొనే నాధుడే ఉండడు అంటే అతిశయోక్తి కాదేమో..
".. ఆ ఏముందిలే, ఆవిడ ఏమైనా భూభారం మోసిందా... ఇంటిని చూసుకోవడం కూడా గొప్ప త్యాగమేనా .." అనుకొనే వాళ్ళు కోకొల్లలు. కానీ ఎంత గొప్పవ్యక్తికైనా,బాల్యంలో తల్లిదండ్రులూ, తర్వాత  తన జీవన సహచరి అండ లేకుండా, కీర్తి శిఖరాల్ని అధిరోహించడం చాలా కష్టం. ఐనా సరే, సన్మానాలూ,అభినందనలూ అందుకొనే వ్యక్తి మాత్రం జీవన సహచరి మాత్రం కాదు. మహా అంటే సభలో ఒక ముక్క ఆవిడ గురించి ఉటంకించొచ్చు గాక!

కాకపోతే.. ఇప్పటి జెనరేషన్ లో చాలా మార్పులు వచ్చాయిఅమ్మాయిలు పెద్ద చదువులు చదువుతున్నారు. ఉద్యోగాలు చేస్తున్నారు. పాశ్చాత్య సంస్కృతీ ప్రభావం విపరీతంగా ఉంది, ముఖ్యంగా విదే శాలకు వెళ్ళే వారు ఎక్కువయ్యారు. స్త్రీ అనుకూల చట్టాలు అనేకం వచ్చాయి. ఒక  ముప్పై యేళ్ళ కిందటి పరిస్థితికీ ఇప్పటికీ సంబంధమే లేదు. స్త్రీకి స్వాతంత్ర్యం కావాలనీస్త్రీ కూడా అన్ని పనులు చెయ్యగలదనీ ఎందరో మహానుభావులు సాహిత్య పరంగా, సామాజికంగా చేసిన సేవలు ఒక ఎత్తైతేసమాజ పరి ణామ క్రమంలో భాగంగా వచ్చిన ప్రపంచీకరణ అసలు జీవనాల్లోని చాలా అర్థాల్ని మార్చేసింది.

ఇప్పుడు స్వాతంత్ర్యానికి ఉన్న అర్థం వేరు..   ఇప్పటి స్వాతంత్ర్యానికి హక్కులు కావాలి.. బాధ్యతలు వద్దు!

బాధ్యతా రహిత స్వాతంత్ర్యంఒక కుటుంబానికైనా, ఒక దేశానికైనా అనర్థదాయకం అన్నది నిష్ఠుర సత్యం.. !  ఇప్పుడు స్వాతంత్ర్యం ముసుగులో జరుగుతున్న ఎక్స్ప్లాయిటేషన్, హైందవ కుటుంబ వ్యవస్థ ఉనికినే  ప్రశ్నార్థకం చేసింది. రోజు పెళ్ళి, రెండేళ్ళలో విడాకులూమళ్ళీ పెళ్ళిళ్ళు.. ఇలా ఉంది.. దీని వల్ల నష్ట పోతోంది ఎవరు..? భార్యా? భర్తా? కుటుంబమా? కావచ్చేమో.. కానీ అంత కన్న భయంకర నష్టం భావి తరాలకు జరుగుతోంది.. విడిపోయే దంపతులకు పిల్లలు ఉంటే.. పిల్లల భవిష్యత్తు, వారి మానసిక వికాసం తీవ్రమైన అలజడులకు గురవుతోంది..

ఇప్పటి సమాజ పరిస్థితుల్లో ప్రబలుతున్న జాడ్యం గురించి విశ్లేషణ..!

 

ఇది ఇప్పటి పరిస్థితులను దగ్గరగా చూడడం వల్ల చేసిన విశ్లేషణ తప్ప, పురుషుడు గొప్పవాడనో, లేక స్త్రీలు గొప్పవారనో చెప్పడానికి చేస్తున్న ప్రయత్నం కాదు. ఏవో కొన్ని సంఘటనలు చూసి స్త్రీలంతా అలాంటి వారే, పురుషులంతా ఇలాంటి వారే అని చెప్పడమూ వ్యాసాల ఉద్దేశ్యమూ కాదు.  ఎంత సేపూ స్త్రీ స్వాతంత్ర్యం , పురుష దురహంకారం లాంటి విషయాలే కాదు.. ఇలాంటివి కూడా ప్రపంచంలో జరుగుతున్నాయి. చాప కింద నీటిలా విష సంస్కృతి మన జీవితాల్లోకి, మన కుటుంబాల్లోకి విస్తరిస్తోందనే అవగాహన కలిగితే, దాన్ని ఎలా నివారించాలి అనే ఆలోచన కలిగితే నా ప్రయత్నం సఫలమైనట్టే..

 

(సశేషం)